అభివృద్ధికి విశాఖ ప్రజలు సహకరించాలి : విజ‌య సాయి రెడ్డి

-

విశాఖ‌ప‌ట్నంలో జీవీఎంసీ పరిధి లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ విజయసాయిరెడ్డి ,మంత్రి అవంతి శ్రీనివాసరావు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ…విశాఖను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామ‌ని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అభివృద్ధిని చేస్తున్నామ‌ని విజ‌య సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులకు వార్డు ప్రణాళికలు అధికారులు సిద్ధం చేసారని ఆయ‌న తెలిపారు.

ysrcp mp vijayasai reddy

వాతావరణం లో సమతుల్యత ఎంతో అవసరమ‌ని…. వనరులను పరిరక్షించవలసిన బాధ్యత మనపై ఉందని విజ‌య సాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రం లో అభివృద్ధి ,సంక్షేమాన్ని ముఖ్యమంత్రి జగన్ సమపాళ్ళతో ముందుకు తీసుకొని వెళ్తున్నారని చెప్పారు. అభివృద్ధి కి విశాఖ ప్రజలు సహకరించాలని….విశాఖ లో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామ‌ని ఎంపీ విజ‌య సాయి రెడ్డి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version