త్వరలో జమ్ము కాశ్మీర్ లో ఎన్నికలు : సీఈసీ సెక్రటరీ

-

ఇటీవల దేశంలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసిన ఎన్నికల సంఘం….త్వరలోనే జమ్మూకశ్మీర్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు సీఈసీ ప్రకటించింది.కశ్మీర్‌లో ఎన్నికల గుర్తుల కేటాయింపు కోసం రిజిస్టర్డ్ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించినట్టు సీఈసీ సెక్రటరీ జయదేబ్ లాహిరి వెల్లడించారు. అలాగే రిజర్వేషన్ల కేటాయింపుపైనా కసరత్తు చేపట్టినట్టు వెల్లడించారు.

ఇక చివరిగా జమ్ముకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో జమ్మూ కాశ్మీర్ సీఎం గా ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం కొన్ని రాష్ట్రపతి పాలన జరిగింది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయాగా ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ప్రస్తుతం జరిగే ఎన్నికలు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగబోయే మొదటి ఎన్నికలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version