ఏపి నామినేష‌‌న్ల ప్ర‌క్రియ‌లో క‌నిపించ‌ని హ‌డావిడి!

-

  • అంద‌రి చూపు కోర్టు తీర్పు వైపే..

ఎక్క‌డైనా ఎన్నిక‌లు అన‌గానే రాజకీయ సంద‌డి వాతావ‌ర‌ణం ఉంటుంది. రాజ‌కీయ పార్టీల‌కు, అధికార యంత్రాంగానికి ఎంతో ప‌ని ఉంటుంది. దాంతో బిజీ బిజీగా క‌నిపిస్తుంటారు. అయితే ఆంధ్ర‌లో మాత్రం ఆ హ‌డావిడి క‌నిపించ‌డం లేదు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ అధికారుల్లో ఆ జోష్ కనిపించటం లేదు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ఏపీలో ఇంకా ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతోంది. ఈ ఎన్నిక‌లు త‌మ‌కు ఏమీ ప‌ట్ట‌న‌ట్లు విశాఖ జిల్లా అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అలాగే కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే దాక ఎన్నికల విధుల‌ను హాజ‌రుకాలేమ‌ని జిల్లా ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. ఈ విష‌యాల‌పై సోమవారం సుప్రీంకోర్టు ఇవ్వ‌నున్న‌ తీర్పు పైనే అందరి దృష్టి ప‌డింద‌ని చెప్పాలి.

శనివారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. అయినా కానీ విశాఖ జిల్లా యంత్రాంగం లైట్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. కానీ ఆ కాన్ఫ‌రెన్స్ కు కలెక్టర్ వినయ్ చంద్ సహా ప‌లువురు జిల్లా అధికారులు దూరంగా ఉన్నారు. ఎంతో బిజీ బిజీగా ఉండాల్సిన క‌లెక్ట‌రేట్ ఆదివారం వ‌ర‌కు బోసిపోతు క‌నిపించింది.

ఇక్క‌డ ఎన్నికలు నిర్వహించాలంటే 30 వేల మంది వ‌ర‌కు సిబ్బంధి అవ‌స‌రం అవుతారు. కానీ ఉద్యోగ సంఘాలు కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే దాక ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని చెబుతున్నాయి. ఈ వాదనను కోర్టు లో కూడా వినిపిస్తామని సంఘాల నేతలు చెబుతున్నారు. దాంతో కోర్టు ఏం చెబుతుంద‌నే దానిపై అంద‌రి చూపు ప‌డింద‌ని చెప్పాలి. కోర్టు చెప్పే తీర్పు తెలియాలంటే కొన్ని గంట‌లు ఆగాల్సిందే. దీంతో ఉత్కంఠకు తెర ప‌డొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version