తెలంగాణ ప్రజలకు అలర్ట్.. కరెంటు పోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి !

-

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, రాబోవు మూడు రోజుల వరకు భారీ వర్ష సూచనల నేపద్యంలో జోనల్, సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్, సుపెరింటెండింగ్ ఇంజినీర్లతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పై సమీక్షా నిర్వహించారు.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి.. చెట్లపై, రోడ్లపై, గృహాలపై విద్యుత్ తీగలు తెగి పడ్డట్లు ఉంటే వాటికి దూరంగా ఉండి, వెంటనే విద్యుత్ శాఖ దృష్టికి తీసుకురాగలరని ఈ సందర్భంగా పేర్కొన్నారు సీఎండీ రఘుమా రెడ్డి.

రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోరాదు.. సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరన్నారు సీఎండీ రఘుమారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version