ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏరువాక తో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా మరోసారి వైఎస్ఆర్ ఉచిత భీమా పరిహారాన్ని అందించనున్నారు. 2021లో పంట నష్టపోయిన 15 లక్షల మంది రైతులకు 2977 కోట్ల పరిహారం ఇవ్వాలి అకౌంట్లో నేరుగా జమ చేయ నున్నారు సీఎం జగన్.
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి లో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాలోకి డబ్బులు జమ చేయ నున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
మంగళవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు కొత్తపల్లి చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. తర్వాత పంటల బీమా మెగా చెక్ రైతులకు అందిస్తారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు అక్కడినుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు సీఎం జగన్.