ఏనుగుల దాడిలో వృద్ధుడు మృతి …!

-

ఏనుగుల దాడిలో వృద్ధుడు మరణించిన సంఘటన చత్తీస్ఘడ్ రాష్ట్రం సూరజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… ప్రతాప్ పూర్ ఫారెస్ట్ రేంజ్ లోని పఖ్నీ గ్రామానికి చెందిన శంకర్ సింగ్ అనే 60 సంవత్సరాలు గల వృద్ధుడిని ఏనుగుల మంద తొక్కి చంపేశాయి. ఇక జులై 6న శంకర్ సింగ్ పరమేశ్వర్ కి వెళ్లి తన సొంత ఊరికి తిరిగి రాలేదు. దీనితో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల అంతటా కూడా గాలింపు చర్యలు చేపట్టిన కూడా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. దీనితో కుటుంబ సభ్యులు పోలీసు అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు అందించారు.

elephant

పోలీస్ అధికారులు సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టగా పోలీసులు గ్రామ సమీపంలోని ఒక అటవీ ప్రాంతంలో శంకర్ సింగ్ మృతదేహాన్ని గ్రహించారు. ఇక మృతదేహం చుట్టుపక్కల కూడా ఏనుగుల అడుగులు ఉండడాన్ని పోలీస్ అధికారులు గమనించి ఏనుగుల మందనే శంకర్ సింగ్ ను తొక్కి చంపినట్లు పోలీసులు అధికారులు నిర్ధారణ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version