బాబ్ కట్ ఏనుగు.. దీని హెయిర్ కట్ తప్పక చూడాల్సిందే..!

-

ఏనుగు పేరు వినగానే మనకి టక్కున గుర్తొచ్చేది.. దృఢమైన ఆకారం, తెల్లటి దంతాలు, అలాగే దాని గాండ్రింపు. కొన్ని ఏనుగులు భీభత్సాలు చేస్తుంటే.. మరి కొన్ని మాత్రం కొంటె పనులు చేస్తుంటాయి. అందుకే పిల్లలు వినీటి చూడటానికి చాలా ఇష్ట పడతారు. పైగా గజేంద్రుడు అంటే వినాయకుని రూపము అంటారు. కాబట్టే ఏనుగులు చాలా దేవాలయాలలో మనకి కనిపిస్తుంటాయి. ఇకపోతే.. ఏనుగులకు లేని ఓ ప్రత్యేకత తమిళనాడులోని ఓ గజానికి ఉంది. అదే బాబ్ కట్ హెయిర్ స్టైల్.

తమిళనాడులో ఉండే ఈ ఏనుగు పేరు బాబ్ కట్ సెంగమలం. ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామెన్ ఈ ఏనుగు రెండు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ ఫొటోలో మావటి దాని జుట్టును దువ్వుతున్నాడు. ఈ ట్వీట్ ఇప్పటికే 16వేలకు పైగా లైక్స్ పొందింది. చాలా మంది ఆ ఏనుగుతో తమ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version