BIG BREAKING : ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్

-

ట్విటర్ కొనుగోలు విషయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రోజురోజుకి ఇస్తున్న ట్విస్టులకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి ఆ సంస్థను తన హస్తగతం చేసుకున్నారు.

ట్విటర్‌ కొనుగోలు విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రావడానికి కోర్టు అక్టోబరు 28 తుది గడువుగా విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలను వేగవంతం చేసిన మస్క్‌.. ఎట్టకేలకు ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నారు. 44 కోట్ల డాలర్లతో ట్విటర్‌ను దక్కించుకున్నారు. ట్విటర్‌ను దక్కించుకున్న వెంటనే ప్రస్తుత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, సీఎఫ్‌వో, పలు విభాగాల అధిపతులను మస్క్‌ తొలగించారు. ట్విటర్‌లో తన ప్రొఫైల్‌ను ‘చీఫ్‌ ట్విట్‌’గా మార్చారు. తన ‘లొకేషన్‌’ను సైతం ట్విటర్‌ ప్రధాన కార్యాలయంగా మార్పు చేశారు.

ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి కోర్టు ఇచ్చిన గడువుకు ఒకరోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ వీడియోలో మస్క్‌ ఓ సింకును మోస్తూ కనిపించారు. ‘ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టా..’నంటూ ఆ వీడియోకు శీర్షికగా రాసుకొచ్చారు. ఈ క్రమంలో ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ హస్తగతం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version