గంట గంటకూ పెరుగుతోన్న ఏలూరు బాదితుల సంఖ్య..

-

ఏలూరు నగరానికేమైంది.? రోజురోజుకు వింత వ్యాది గ్రస్తుల సంఖ్య పెరిగిపోతుండడం.. వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి కారణాలను కనుక్కునేందుకు ఓ వైపు వైద్యులు ప్రయత్నిస్తోంటే.. లేటెస్ట్‌గా ఓ నర్సుకు వ్యాధి సోకింది.  మరోవైపు… ఇవాళ ఏలూరుకు కేంద్రబృందం రానుంది. వ్యాధికారణాలు తెలియక జనంతోపాటు వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కూర్చున్నవారు కూర్చున్నట్లుగానే, నిలుచున్న వాళ్లు నిలుచున్నట్లే పడిపోవడం, కళ్లు తిరగడం, కొన్ని సందర్భాల్లో స్పర్శ కూడా లేని పరిస్థితి. సిటీలో రోజుల వ్యవధిలో వ్యాధి గ్రస్తుల సంఖ్య 500ని దాటింది.

ఒకరు మృతి చెందారు. ఇంకా చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అస్వస్థతకు గురైన వారు 3 నుంచి 5 నిమిషాలపాటు మూర్ఛ పోతున్నారని వైద్య సిబ్బంది గుర్తించారు. కొందరికి  మతిమరుపుతో పాటు తలనొప్పి, వెన్నునొప్పి, నీరసంగా ఉంటోందని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదంటున్నారు అధికారులు, చాలామందికి సీటీ స్కాన్‌ చేసినా.. ఎలాంటి సమస్యలు బయటపడలేదు. నీటి పరీక్షలు,రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి. ఈ అంశంపై .. రాష్ట్ర హైకోర్టు నివేదిక కోరింది. దీంతో జిల్లాకు చెందిన సీనియర్ సివిల్ జడ్జి.. బాలకృష్ణన్.. వ్యాధికి సంబందించి హైకోర్టుకు ఓ నివేదిక ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version