ఓటీటీ లోకి వచ్చేస్తున్న ఇంకొక లవ్ స్టోరీ..!

-

ఈ మధ్యకాలంలో థియేటర్లలో కంటే ఓటీటీలోనే మంచి హిట్లను సొంతం చేసుకుంటున్నాయి సినిమాలు. ఈ మధ్య ఓటీటీ సినిమా సందడి ఎక్కువగానే వుంది. థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేదు. ఇప్పుడు ఈ యూత్ ఫుల్ ప్రేమ కథ సినిమా ఓటీటీ లో సందడి చేయబోతుంది. ఆ సినిమానే ఏం చేస్తున్నావ్. భరతమిత్ర తీసుకొచ్చిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో దాదాపు అందరూ కొత్త వాళ్లే నటించారు.

విజయ రాజ్ కుమార్, నేహా పటాన్ని తదితరులు ఈ సినిమాలో నటించారు గత ఏడాది ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడంతో సినిమా వచ్చింది కూడా పెద్దగా తెలియలేదు దాంతో సినిమా పెద్దగా ఆడలేదు. ఈ నెల మార్చి 28 నుండి ఏం చేస్తున్నావ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది మరి సినిమా ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version