ఆరోగ్యం క్షీణించడంతో ఓ వ్యక్తిని అతని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. తీరా ఆస్పత్రికి చేరుకున్నాక డాక్టర్లు లేక, బాధితుడికి ఆస్పత్రిలో బెడ్లు దొరకక కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమనగల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
దవాఖానాలో పడకలు ఖాళీగా లేవు. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా బెడ్లన్నీ నిండిపోయాయి. ఆరోగ్యం బాలేదని కుటుంబసభ్యులు ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమయానికి డాక్టర్ కూడా లేకపోవడం, బెడ్లు ఖాళీ ఉండకపోవడంతో నర్సు ఆ బాధితుడిని ఆటోలో పడుకోబెట్టి చికిత్స చేసింది.రోగి వీక్ ఉన్నాడని అతడికి సెలేన్ బాటిల్ లెక్కించింది నర్సు. కానీ సెలేన్ స్టాండ్ లేకపోవడంతో అతడి కుమార్తెను గ్లూకోజ్ బాటిల్ ఇచ్చి పైకి లేపి పట్టుకో అని చెప్పింది నర్సు. చేసేదేమి లేక, చేతులు గుంజినా రోగి కుమార్తె బాటిల్ ను అలానే పట్టుకుని నిల్చుంది. డాక్టర్లు ఎంతసేపైనా రాకపోవడంతో ఎదురు చూసి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆ కుటుంబ సభ్యులు.