ఎస్పీ బాలు మరణంతో ఆయన సొంత గ్రామంలో విషాదం నెలకొంది. నగరి సమీపంలోని తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా పల్లెపట్టు తాలూకా కొనటంపేట గ్రామం గ్రామంలో విషాదం నెలకొంది. రెండో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు అక్కడి స్కూలులో చదువుకున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఆయన అక్కడి స్కూల్స్ కి కూడా ఆర్ధిక సహాయం చేసారు. శ్రీ వేంకటేశ్వర యువజన సేవా సంఘం పేరుతో పాత విద్యార్థులు సంఘంగా ఏర్పడి స్కూలు అభ్యున్నతికి ఎస్పీ బాలు సాయం చేసారు.
విద్యార్థులకు అవసరమైన నీటి వసతికి సంబంధించిన వాటర్ ప్లాంట్ కు 14 లక్షలు ఎస్పీ బాలసుబ్రమణ్యం సాయం కూడా చేసారు. మరుగుదొడ్లు తాగు నీటి సౌకర్యానికి 13 లక్షలు నిధులు ఇచ్చారు ఆయన. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… ఇంటి పెద్దను కోల్పోయినంత బాధగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. ఎస్పీ బాలు కుటుంబం శోకసముద్రం నుంచి బయటపడాలని కోరుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేసారు. బాలు మా ఇంటి మనిషి అంటూ పేర్కొన్నారు.