పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అభిమానులు చాలా ఊహించుకున్నారు.. ఖచ్చితంగా జనసేన మరో ప్రజారాజ్యం కాదని నమ్మారు. పవన్ ఎవరికీ తొత్తులా ఉండరని.. తాను నమ్మిన సిద్ధాంతాలను, తనను నమ్మిన జనాలను వంచించరని భావించారు.. ఏదో చేస్తారని ఊహించారు.! కాని పవన్ తాజాగా ఏపీ రాజధానిపై తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు! విశాఖ – గోదావరిలపై తనకున్న అక్కసును వెళ్లగక్కారా.. బాబు మాట కాదనలేకపోయారా అనేది చూద్దాం!
అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని జనసేన తన స్టాండ్ ని అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు అందచేసింది. దీంతో విశాఖ పరిపాలనా రాజధాని విషయంలో టీడీపీ మాటే జనసేన మాట అని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. కేంద్రీకరణ అభివృద్ధి వద్దు పరిపాలనా వికేంద్రీకరణ ముద్దు అని హైదరాబాద్ విషయంలో క్లారిటీ వచ్చినా కూడా.. అది అదే ఇది ఇదే.. అది నాటి మాట ఇది నేటి మాట అని చెప్పేస్తున్నారు! విశాఖ కూడా రాజధాని అయితే.. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలతో పాటు మరో వైపు గోదావరి జిల్లలు కూడా బాగుపడతాయని అంచనాలు ఉన్నాయి.
ఉత్తరాంధ్ర చేసిన నేరమేమిటి? గాజువాకలో పవన్ కు అడ్రస్ లేకుండా చేయడమా? గోదావరి జిల్లా వాసులు చేసిన పాపమేమిటి? అన్నా దమ్ములిద్దరినీ ఓడగొడ్డించడమా? అదేనా ఆ రెండు ప్రాంతాల ప్రజలు చేసిన నేరం? పవన్ కే తెలియాలి.. జనసేనే చెప్పాలి! అబ్బే పవన్ మనసులో అలాంటివేమీ లేవు… కానీ చంద్రబాబు మాట కాదన్లేని దత్తపుత్ర బలహీనత అది. ఆ బలహీనతే ఉత్తరాంధ్ర వద్దు కేవలం అమరావతే ముద్దు అనే మాట పలికించింది అంటారా? ఒప్పేసుకున్నట్లే!!
-CH Raja