తెలంగాణలో ఓ ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. విషయం వెలుగులోకి రావడంతో అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఏకంగా రూ.కోటి మేర కుంభకోణం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బులన్నీ రైతులకు చెందినవిగా గుర్తించారు.
అసలు విషయానికొస్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట SBI బ్యాంకు ఉద్యోగి కిరణ్.. 45 మంది రైతుల ఖాతాల నుంచి కోటిన్నర రూపాయలను తన ఖాతాకు మళ్లించాడు. విషయం కాస్త బయటకు రావడంతో సదరు ఉద్యోగి కిరణ్‌పై కేసు నమోదు చేసి, అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. రైతులు బ్యాంకు వారిని నిలదీయడంతో వారు కిరణ్ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి తిరిగి జమ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.