జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు మరియు జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ లోని రఖామా ప్రాంతంలో ఈ ఎనౌకౌంటర్ చోటు చేసుకున్నట్టు సమాచారం. మొదట జవాన్లను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో వెంటనే అప్రమత్తమయిన భద్రతా దళాలు ఎదురు కాల్పులు చేయడం మొదలు పెట్టాయి.
జమ్మూ కశ్మీర్ లో ఎన్కౌంటర్..ఉగ్రవాది హతం..!
-