తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే గులాబ్ ధాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో మూసీ నదికి భారీ వరద వచ్చింది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో వేర్వేరు ఘటనల్లో నాలాలో పడి ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి.
రైతులకు అపార నష్టం ఏర్పడింది. అయితే తాజగా మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురియనున్నాయి. తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో మళ్లీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వానలతో తడిసిముద్దయ్యే పరిస్థితి ఏర్పడింది.