సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి!

-

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో కిస్టారం ఏరియా కమిటీ సభ్యుడు లోకేష్ మృతి హతమైనట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లాలోని కిస్టారం పీఎస్ పరిధిలోని పామలూరు గ్రామ అటవీ-కొండలో పోలీసులు, నక్సలైట్లు ఒకే సారి ఎదురు పడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం.

 

మావోయిస్టుల గురించి సమాచారం తెలియడంతో డీ‌ఆర్‌జీ , బస్తర్ ఫైటర్, 206 కోబ్రా, 208 కోబ్రా, 131 సీఆర్పీఎఫ్ దళాల ఉమ్మడి బృందం ఆధ్వర్యంలో దబ్బకొండ, అంతపాడ్ బుర్కలంక, పామ్లూర్, సింఘనమడ్గు, పరిసర ప్రాంతాలలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే జరిగిన తాజా ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఏసిఎం లోకేష్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version