తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ యాక్టివ్ అవ్వబోతుందా..? తీగల కిష్ణారెడ్డి దారిలో మరికొందరు..?

-

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం.. తెలంగాణాలో పూర్వ వైభవం కోసం వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.. డీలాపడ్ద పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధినేత చంద్రబాబు.. టైమ్ కేటాయిస్తున్నారు.. గతంలో పార్టీలో ఉండి.. ఇప్పుడు ఇతర పార్టీల్లో కీలకంగా ఉన్న నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు స్కెచ్చేస్తున్నారు..దీనికిమాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కామెంట్స్‌ బలం చేకూరుస్తున్నాయి.

తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నంటున్న మాజీ ఎమ్మెల్యే తీగల కిష్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..తనతోపాటు.. మరికొందరు కూడా వస్తారని ఆయన బాంబ్ పేల్చారు.. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని.. త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తామని ప్రకటించారు.. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారాయన. ఇవి ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి..

విభజన తర్వాత ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు వరుస పెట్టి గులాబీ గూటికి చేరారు. చివరకు టీడీఎల్పీ బీఆర్ఎస్‌లో విలీనం అయిపోయింది. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ కరుమరుగైంది..2018లో టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు పొత్తులో పోటీ చేశాయి. అయినా అప్పుడు బీఆర్ఎస్‌ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి. దీంతో టీడీపీలో ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా గులాబీ గూటికి షిప్ట్ అయ్యారు.. దాంతో గతేడాది జరిగిన తెలంగాణ ఎన్నికలను లైట్‌ తీసుకుంది టీడీపీ.

ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో తెలంగాణాలో పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి పెట్టారు.. తిరిగి గత వైభవాన్ని తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్‌, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్‌ ఓటు బ్యాంకైన కమ్మ ఓటర్లు హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు. మరికొన్ని సెగ్మెంట్లలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. ఖమ్మంలోనూ కమ్మ ఓటర్లు ఉండటం..విజయవాడకు బార్డర్‌గా ఉన్న జిల్లా కావడంతో అక్కడ కూడా టీడీపీకి అంతో ఇంతో పట్టుంది. దీంతో కృష్ణారెడ్డిని పార్టీలోకి చేర్చుకుని..ఆయన ద్వారా మరికొంత మందిని లాగాలని చంద్రబాబు చూస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. మొత్తంగా చంద్రబాబు స్టాటజీ ఏంటో తెలియాంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version