జలదిగ్బంధంలో ఏడుపాయల.. షెడ్‌లోనే దేవీ నవరాత్రులు!

-

మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాదేవి ఆలయం గర్భగుడి ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉంది. దీంతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోని గోకుల్ షెడ్‌లో నిర్వహిస్తున్నారు. వనదుర్గా అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారికి నీలి రంగు వస్త్రంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

అయితే, సింగూరు ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంటంతో ఆలయం వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది.దీంతో గత కొంతకాలంగా ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలో ఉంది. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్చకులు రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు.అయితే, వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు.మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు ఈవో తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version