ముగియ‌నున్న తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు.. నేడే చివ‌రి రోజు

-

తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు నేటితో ముగియ‌నున్నాయి. ఈ నెల 7 వ తేదీ నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు 2022-23 వార్షిక బ‌డ్జెట్ అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టారు. అలాగే శాస‌న మండ‌లిలో శాస‌నస‌భ వ్య‌వ‌హ‌రాల మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టాడు. ఈ వార్షిక సంవ‌త్సరానికి రాష్ట్ర ప్ర‌భుత్వం 2.56 కోట్ల అంచ‌నాతో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టింది.

ఈ నెల 7న బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌గా.. 9వ తేదీ రోజు సాధార‌ణ బ‌డ్జెట్ పై చ‌ర్చ జ‌రిగింది. అలాగే త‌ర్వాతి నాలుగు రోజుల్లో బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిగింది. మొత్తంగా 37 ప‌ద్దుల‌ను శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. కాగ నేడి చివ‌రి రోజు కాబ‌ట్టి.. నేడు ద్ర‌వ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ, మండ‌లిలో చర్చ జ‌ర‌గ‌నుంది.

ఈ ద్ర‌వ్య వినిమ‌య బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత‌.. ఎఫ్ఆర్ ఎంబీ, మార్కెట్ క‌మిటీల చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ల బిల్లుల‌పై మండ‌లిలో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. కాగ ఈ రోజు ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేశారు. అలాగే ఈ రోజు 2020 మార్చితో ముగిసిన వార్షిక సంవ‌త్స‌రం కాగ్ నివేదిక‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌వేశ పెట్ట‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version