ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్ పాకిస్తాన్ లోని కరాచీ వేదికగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సౌతాఫ్రికాకు చాలా కీలకం కానుంది. ఇంగ్లండ్ ఓడినా.. గెలిచినా పెద్దగా ప్రయోజనం లేదు. కానీ సౌతాఫ్రికా భారీ తేడాతో ఓడితే మాత్రం అప్గానిస్తాన్ సెమీస్ కి చేరే అవకాశం ఉంటుంది. సౌతాఫ్రికా విజయం సాధిస్తే.. గ్రూపు-బీలో టాప్ ప్లేస్ లోకి వెళ్తుంది.
ఇంగ్లండ్ జట్టు : ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జెమీ స్మీత్, జో రూట్, హార్రీ బ్రూక్, జాస్ బట్లర్, లివింగ్ స్టోన్, జెమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, షకీబ్ మహ్మద్.
సౌతాఫ్రికా జట్టు : ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి.