ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం.. ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్

-

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం (2023-24) నుంచి ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది.  20 శాతం మార్కులను ఈ ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నట్లు పాలకమండలి తెలిపింది. రాత పరీక్షను 80 మార్కులకే పరిమితం చేస్తామని పేర్కొంది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషకు సంబంధించి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్‌ను అమలు చేస్తామని చెప్పింది.

ఇప్పటివరకు ఎంఈసీ, ఎంపీసీ గ్రూపునకు ఒకే స్థాయి గణితం ఉంది. ఎంపీసీకి ఉన్నంత కఠినంగా ఎంఈసీ విద్యార్థులకు గణితం ఉండాల్సిన అవసరం లేదని, కామర్స్‌కు తగ్గట్లు సిలబస్‌లో మార్పులు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామంది. అయిదేళ్ల తర్వాత శుక్రవారం జరిగిన ఇంటర్‌బోర్డు పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు ఛైర్మన్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి… వైస్‌ ఛైర్మన్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో 2017 నుంచి అమలు చేసిన వాటికి బోర్డు ఆమోదం తెలపడంతో పాటు పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version