మనిషికి ఆనందం వచ్చినా.. బాధ వచ్చినా..కన్నీళ్లు వస్తాయి. కాకపోతే అవి వచ్చే కారణాలు వేరుగా ఉంటాయి.. సంతోషంగా ఉన్నప్పుడు వస్తే.. ఆనందబాష్పాలు అంటారు. బాధగా ఉన్నప్పుడు వస్తే.. కన్నీళ్లు అంటారు. పేరు ఏదైనా వచ్చేవి ఒకటే అంటారేమో.. వేర్వేరు.. కళ్లలో వచ్చేవి కానీ వాటిలో రకాలు ఉంటాయి. కన్నీళ్లకు కూడా హార్మోన్స్ ఉంటాయి. వాటివల్లే బాధగా ఉన్నప్పుడు ఏడ్వటం వల్ల కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. మీకు తెలుసా..? కన్నీళ్లలో రకాలు ఉంటాయని.. అసలు కన్నీళ్లు ఎందుకు ఉప్పగా ఉంటాయి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం అంటే ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది కదూ..!
కన్నీళ్లలోని ఎలక్త్రోలైట్స్ కారణంగా కంట్లో బాక్టీరియా, ఇతర క్రిములు పెరగకుండా చేసుకుంటాయి. అలాగే కన్నీళ్లలో అనేకరకాల కార్బనిక, అకార్బనిక సమ్మేళనాలు, ప్రోటీన్లు, లవణాలు ఉంటాయి. ఈ లవణాలలో ముఖ్యమైనవిగా సోడియం, పొటాషియం. అందుకే కంట్లో నుంచి వచ్చే నీళ్ళు ఉప్పగా ఉంటాయి. అయితే కన్నీళ్లలో రకాలు కూడా ఉంటాయట. కన్నీళ్లు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాయి. ఒకసారి ఎక్కువ ఉప్పగా ఉంటే మరోసారి తక్కువ ఉప్పగా ఉంటాయి.
ఒకటి బెసల్ కన్నీళ్లు
ఈ రకం కన్నీళ్లు.. మన కళ్ళు ఎప్పుడూ పొడిబారకుండా ఉంచుతాయి. కను రెప్పలు మూస్తున్న ప్రతీసారి కన్నీటి గ్రంధులలో నుంచి నీళ్లు వస్తాయి. ఇవి ఎక్కువ ఉప్పగా ఉంటాయట.
అలాగే రిఫ్లెక్స్ కన్నీళ్లు.
దుమ్ము, ధూళి, ఉల్లిపాయలు తరిగెటప్పుడు విడుదలయ్యే కెమికల్స్ ఈ కన్నీళ్లు మన కళ్లను సురక్షితంగా ఉంచుతాయట.
ఇక సైకిక్ కన్నీళ్లు
ఇవి మనలో ఉండే ఎమోషన్స్ కారణంగా వస్తాయట. అయితే ఇతర కన్నీటిలో లేని హార్మోన్లు, ప్రోటీన్లు ఉండటంతో ఈ కన్నీళ్ల ద్వారా మన బాధ కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. అందుకే బాధగా ఉంటే..ఎంత ఏడ్వాలో అంత ఏడ్చేయమంటారు. అలా బాధను దిగమింగుకొని ఉంటే.. అది ఇంకా రెట్టింపు అయినట్లు అనిపిస్తుంది. ఏడ్చేస్తే..గుండెల్లో బరువు కొంతైనా తగ్గిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి..మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే.ఏడ్చేయండి..ఫ్రీగా ఉండగలుగుతారు.