ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనతో కోట్లాది మందికి ప్రయోజనం..!

-

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ ఒకటి తీసుకొచ్చింది. . 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 23.34 కోట్ల మంది ఖాతాదారులకు 8.50 శాతం వడ్డీని ఖాతాల్లోకి జమ చేసింది. ఈపీఎఫ్ఓ స్కీమ్, 1952 పారా 60 కిందనున్న ప్రొవిజన్ల ప్రకారం ఈపీఎఫ్ పథకంలో సభ్యులైన ప్రతి ఒక్క అకౌంట్‌కి 8.50 శాతం వడ్డీని జమ చేయాలనీ అనుకుంది.

1952 పారా 60(1) కింద కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తమకు తెలియజేసినట్టు ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే మీ అకౌంట్ లో కూడా డబ్బులు పడ్డాయా లేదా అనేది ఇలా తెలుసుకోండి.

7738299899 నెంబర్‌కి EPFOHO UAN ENG టైప్ చేసి పంపించాలి. అప్పుడు బ్యాలెన్స్ చూసుకొచ్చు. లేదా అకౌంట్ బ్యాలెన్స్ కోసం రిజిస్టర్డ్ యూజర్లు 011-22901406కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. వెబ్ సైట్ లో కూడా చూడచ్చు. ఇక అది ఎలా అనేది చూస్తే..

ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైటుకి వెళ్లాలి.
అక్కడ ‘Our Services’ ఓపెన్ చేసి, దానిలో ‘For Employees’ని క్లిక్ చేయాలి.
‘Member Passbook’ ను క్లిక్ చేయాలి.
ఇక్కడ యూఏఎన్, పాస్‌వర్డ్ క్లిక్ చెయ్యాలి.
ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version