కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన.. బాక్స్ ఆఫీసు ను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. పంచకట్టు తో సరసాలు, చిలిపి వేశాలకు బాక్స్ ఆఫీసు మోత మోగింది. బంగార్రాజు గా నాగార్జున చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు.
ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. ఇవాళ అక్కినేని నాగ చైతన్య బర్త్ డే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. “బంగార్రాజు” అంటూ సాగే.. పాటను లిరిక్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ టీజర్ ను డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
Presenting the First #MusicalPoster of Bangarraju party song the #PartySongOfTheYear from #Bangarraju
Song Teaser out On Dec 17th@iamnagarjuna @IamKrithiShetty @kalyankrishna_k @fariaabdullah2 @anuprubens @AnnapurnaStdios @ZeeStudios_ @ZeeMusicCompany pic.twitter.com/XMj0yUaNob— chaitanya akkineni (@chay_akkineni) December 14, 2021