ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డిపాజిటర్ల ఖాతాల్లో వడ్డీ డబ్బులు వేసింది. మీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో లేదో కూడా మీరు చేసుకోండి. 24.07 కోట్ల మంది అకౌంట్లలోకి ఆర్థిక సంవత్సరం 2020-21కి చెందిన 8.50 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ క్రెడిట్ చేసింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా చెప్పింది. 24.07 కోట్ల అకౌంట్లలోకి 8.50 శాతం రేటుతో వడ్డీని ట్రాన్స్ఫర్ చేసింది. అయితే మీకు కూడా డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవాలి..? అయితే ఇలా చెక్ చేసుకోండి. మీరు కనుక మీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో లేదో చూడాలంటె 7738299899 నెంబర్‌కి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మీ ఈపీఎఫ్ఓ యూఏఎన్ ఎల్ఏఎన్ ను ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తే బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవడం అవుతుంది.
మీకు నచ్చిన భాషలో మీరు చూడచ్చు. ఇంగ్లిష్, హిందీ, తమిళ్ ఇలా మీకు నచ్చిన భాష లో మీరు చెక్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు మిస్డ్ కాల్ ద్వారా బాలన్స్ ని చూడాలంటె మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011 22901406కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇలా ఈజీగా మీరు బాలన్స్ ని తెలుసుకొచ్చు. అలానే ఆన్ లైన్ లో వెబ్ సైట్ ద్వారా కూడా బ్యాలెన్స్ ని చెక్ చెయ్యచ్చు.
ఈపీఎఫ్ పాస్‌బుక్ పోర్టల్‌ను సందర్శించి మీ ఖాతాల్లో డబ్బులు ఎంత ఉన్నాయో చూడచ్చు. పోర్టల్ లోకి లాగిన్ అయ్యాక.. యూఏఎన్ , పాస్‌వర్డ్ ఎంటర్ చెయ్యాలి. ఇలా మీరు మీ పాస్‌బుక్‌ను చూసుకోవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం చెయ్యచ్చు. లేదా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోచ్చు.