మద్యపాన బానిసల కోసం డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు : డిప్యూటీ సీఎం పవన్

-

డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేశారని..ప్రజలను కొత్త కొత్త బ్రాండ్ల మద్యానికి బానిసలుగా చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మద్యపాన నిషేధం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.

అయితే మద్యానికి బానిసలుగా మరారని ప్రజల కోసం డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై వచ్చిన ఆదాయంలో 10 శాతం డీ అడిక్షన్ సెంటర్లు నిర్వహణ కోసం ఉపయోగించాలని అన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో దోపిడీ జరిగిందని ధ్వజమెత్తారు. ఇక వాటిపై సభలో తాము నిలదీస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనన్న భయంతో వైసీపీ నేతలు సభకు రాకుండా తప్పించుకుని పారిపోయారని మండిపడ్డారు.అనంతరం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి పై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version