తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది.ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జలాశయాలు నిండు కుండగా మారాయి. మరో రెండు రోజుల పాటు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు మంచిర్యాల,కుమ్రంభీం-ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి,నిజామాబాద్, వరంగల్, హన్మకొండ,ములుగు, జనగామ,కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీచేశారు.