వాళ్లంతా టచ్‌ లో ఉన్నారు..27 తర్వాత భారీగా చేరికలు – ఈటల రాజేందర్

-

ఈటల రాజేందర్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఇప్పుడు రోజులు బాగా లేవని.. 27 తరువాత బీజేపీ లోకి చేరికలు ఉంటాయన్నారు. Trs …కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారు… సీఎం మీద పోటీచేసుడే.. ఒడించుడేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఢిల్లీ లో రాదు ఇక్కడ ఎడగదని… కాంగ్రెస్ కి ఓటు వేస్తే టీఆర్ఎస్ కి ఓటు వేసినట్లేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన వారిని ముందు ఉండి వాళ్ళను గెలిపిస్తానని ప్రకటించారు. హుజురాబాద్ ఫార్ములా ప్రకారం పనిచేస్తామని.. తిరుపతి కొండమీద కాంగ్రెస్ కి కెసిఆర్ ను ఎదుర్కొనే సత్తా లేదు అని రాజగోపాల్ రెడ్డి చెప్పారని.. ఆయన కెసిఆర్ మీద కసి తీర్చుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఆ వేదిక బీజేపీ మాత్రమే అని ఆయన్ను ఆహ్వానిస్తున్నామని ఈటల వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేస్తా అని కెసిఆర్ మాట తప్పారని.. అనేక అంశాలు మానిఫెస్టో లో రాసుకొని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ హామీలు, వైఫల్యాల ను ఎండగట్టేందుకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నేను దేవరకద్ర వెళ్తున్నానని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మా ఆక్షన్ ప్లాన్ ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎగరేది బీజేపీ జెండానేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version