తెలంగాణలో భద్రాచలం సమీప ప్రాంతాల్లో వరదలకు కారణం పోలవరం కాదని అన్నారు బిజెపి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఒక్కసారిగా వదలడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులు దారి మళ్లించి, వాటిని ఇతర అవసరాలకు వాడుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సర్పంచులను ఢిల్లీకి తీసుకువచ్చి నిధుల మంజూరు గురించి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు.