హుజురాబాద్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు – ఈటల రాజేందర్‌

-

హుజురాబాద్ లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు తెచ్చారని కేసీఆర్‌ సర్కార్‌ పై ఈటల రాజేందర్‌ ఆగ్రహించారు. హుజురాబాద్ లో ఉన్న ప్రశాంత వాతావరణంను అధికారపక్షం నేతలు చెడగొడుతున్నారు. ప్రజల మీద దాడులు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను అకారణంగా కొడుతున్నారని నిప్పులు చెరిగారు.

నిన్న మా మీదనే దాడి చేస్తే.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. మళ్లీ మా నేతలు, కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని వెళ్లి విపరీతంగా కొడుతున్నారు. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు. అధికారపక్షం ఆగడాలు శృతిమించాయని తెలిపారు.

పోలీసులు అధికారపక్షం తొత్తులుగా మారారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోవలసిన అవసరం ఏంది ? కొట్టడం ఏంటి? డీజీపీ గారు చట్టం పనిచేస్తుందా ? లేదా ? అని ప్రశ్నించారు. మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్,తుమ్మ శోభన్ లని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version