లవర్‌కు వేరొకరితో ఎంగేజ్‌మెంట్.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

-

తను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయిందన్న బాధతో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం రోజున ఆ యువతి ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆ యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కోట మండలం చంద్రశేఖరపురం ఎస్టీ కాలనీకి చెందిన కొట్లపూడి తేజ డిగ్రీ చదువుతున్నాడు. ఇతను ఓజిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతికి మరొకరితో వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలియడంతో ఆదివారం ఉదయం ఆ గ్రామానికి వెళ్లాడు. యువతి ఇంటికి వద్దకు వెళ్లి పిలవగా ఆమె రాకపోడంతో అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయాడు.

రెండోసారి ఇంటి వద్దకు వచ్చిన యువకుడు వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో స్థానికులు స్పందించి మంటలు అదుపుచేశారు. 108లో గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version