పార్టీ నుంచి గెంటేసిన వాళ్లు.. తగ్గి మరీ తనను మళ్లీ ఆహ్వానించినా తాను ఆ పార్టీకి వెళ్లనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనకు నష్టం కలిగించాలనే వ్యూహంతోనే శాసనసభలో తన గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడారని అన్నారు. ‘నన్ను బీఆర్ఎ్ నుంచి గెంటేశారు. గెంటిన వాళ్లు మళ్లీ పిలిచినా వెళ్లే ప్రసక్తేలేదు’ అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
తాను అసెంబ్లీకి రాకూడదని బీఆర్ఎస్ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఈటల ఆరోపించారు. శాసనసభ సమావేశాల అనంతరం మీడియాపాయింట్‌లో ఈటల విలేకరులతో మాట్లాడారు. ‘‘ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే విధేేయుడిగా ఉంటా. 2004లో కూడా నాటి సీఎం వైఎస్‌తో కలుస్తానని ప్రచారం చేశారు. ఆనాడూ పార్టీ మారలేదు. ఇప్పుడు కూడా భాజపాను వీడను. ఏపార్టీలో ఉన్నా ఆ పార్టీకి సైనికుడిలా పనిచేస్తా. భాజపాలో కూడా సైనికుడిగానే పనిచేస్తున్నా’’ అని ఈటల స్పష్టం చేశారు