మెడపై కత్తి పెట్టి..పొడిచి చంపాలని చూస్తున్నారు : ఈటల రాజేందర్

-

మోకాళ్ల మీద నడిచిన హుజూరాబాద్ లో టీ ఆర్ ఎస్ గెలవదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాను రాజీనామా చేసి నాలుగు నెలల 20 రోజులు అవుతుందని.. ప్రజాస్వామ్యని అపహాస్యం చేసే పద్దతిలో నాయకుల ప్రవర్తన ఉందన్నారు. ఒక్కడిని ఓడగొట్టాలని.. అసెంబ్లీ లో కనపడకుండా చేయాలనీ పరిపాలని పక్కన పెట్టారని మండిపడ్డారు.

ఎంఎల్ ఎలు, ఎంఎల్సీ లు దావత్లకు స్వయంగా సర్వ్ చేస్తున్నారన్నారు. సొంత పార్టీ నాయకులను కొనుగోలు చేసే సంస్కృతి తెరాసదని. బలవంతం గా కండువాలు కప్పుతున్నారని నిప్పులు చెరిగారు. తన మెడ పైన కత్తి పెట్టాలని చూస్తున్నారని.. ప్రజల కోసం కోట్లాడే తనను పొడిచి చంపాలని చూస్తున్నారని సంచలన వ్యక్తలు చేశారు. దళితుల మీద ప్రేమతో కాదు దళితుల ఓట్ల కోసం దళిత బంధు ఇస్తున్నారన్నారు. ధర్మాన్ని పాతరేసి ఈటలని బొంద పెట్టాలని స్కీమ్ లు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మద్యం తాగితే తప్ప తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు వచ్చే పరిస్థితి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version