తెలంగాణ-ఆంధ్ర బార్డర్‌లో వెలసిన ఆసక్తికరమైన పోస్టర్

-

తెలంగాణ-ఆంధ్ర బార్డర్‌లో కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ-ఆంధ్ర బార్డర్‌లో ఆసక్తికరమైన పోస్టర్ వెలసింది. ఓవైపు బాస్ ఈస్ బ్యాక్ అంటూ చంద్రబాబు ఫోటో ఉంటే… మరోవైపు బాస్ ఈస్ కమింగ్ సూన్ అంటూ కేసీఆర్ ఫోటో పెట్టారు. మధ్యలో డాకు మహరాజ్ టైటిల్‌తో బాలయ్య ఫోటో పెట్టారు. ఖమ్మం జిల్లా ముగ్గు వెంకటాపురంలో ఈ బ్యానర్ దర్శనమిచ్చింది.

An interesting poster on the Telangana-Andhra border

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో హల్‌చల్ చేస్తోంది. అయితే.. తెలంగాణ-ఆంధ్ర బార్డర్‌ ఖమ్మం జిల్లా ముగ్గు వెంకటాపురంలో ఈ బ్యానర్ ఏర్పాటు చేసింది తెలంగాణ వాళ్లేనని సమాచారం. అందులోనూ బాలయ్య ఫ్యాన్స్‌ అని సమాచారం అందుతోంది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version