తెలంగాణ సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్యెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం కొంటామని హామీ ఇచ్చిందని.. ఐకేపీ సెంటర్ల లో నెల రోజులు గా రైతులు ధాన్యం తో పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని..రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం బెంగాల్ కాదు ఇక్కడ మంచికి మాత్రమే తెలంగాణ ప్రజలు పట్టం కడతారని.. నీ భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు ఈటల రాజేందర్. సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేక పోవడం తో దాన్యం కొనడం లేదని అనుమానం వస్తుందన్నారు.
నా రైతులు.. నా రాష్ట్రం అన్న కేసీఆర్ మన రైతుల కోసం ధ్యానం ఎందుకు కొనుగోలు చేయవని ప్రశ్నించారు ఈటల రాజేందర్. బాధ్యత గల ప్రతి పక్ష పార్టీ గా బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళితే రాళ్ల తో దాడి చేయడం హేయమైన చర్య అని నిప్పులు చెరిగారు. హుజురాబాద్ ఓటమి ఫ్రస్టేషన్ను రైతులపై చూపించటం తగదన్నారు. తెలంగాణ రైతులు కన్నీళ్ళకు కారణం కేసీఆర్ ప్రభుత్వం అని మండిపడ్డారు.