వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో.. ఆయన డ్రైవర్ దస్తగిరి రెండు రోజుల కింద… సిబిఐ అధికారుల ముందు లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక విషయాలను సీబీఐ అధికారులకు చెప్పాడు దస్తగిరి. వివేకా హత్య కేసు వెనుక.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నట్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వైయస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైయస్ వివేకా హత్య కేసు కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వందకు వందశాతం కారకుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే… ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ని సీబీఐ అధికారులు విచారించాలని అని డిమాండ్ చేశారు.
ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసు కోవాలని కూడా కోరారు పట్టాభి. ఈ కేసులో నిందితులను తొందరగా తేల్చకుండా.. అధికారులను మార్చుతూ… సిబిఐ విచారణను ఆపాలంటూ సీఎం జగన్ అనేక ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. పరోక్షంగా తన సొంత బాబాయ్ హత్యకు సీఎం జగన్ సహకరించాడని నిప్పులు చెరిగారు. చట్టానికి అందరూ సమానులే అని పేర్కొన్నారు.