కాళేశ్వరం రిపోర్ట్ పై స్పందించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పుల తడక.. ఈ రిపోర్టు నిలవదు అని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ వాళ్లకు చేతగాకనే సీబీఐకి అప్పగించారని చురకలు అంటించారు. పని చేయడం చేతకాదని… పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

దింతో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వాస్తవంగా.. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టిన సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేశారు ఈటల రాజేందర్. ఇందులో భాగంగానే కాలేశ్వరం రిపోర్టులో ఈటల రాజేందర్ పేరు కూడా వచ్చింది. కెసిఆర్ కుటుంబం తప్పులు చేస్తుంటే ఈటల రాజేందర్.. చూస్తూ కూర్చున్నారని రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ కాలేశ్వరం రిపోర్టు పై స్పందించారు. ఆ రిపోర్ట్ చెల్లదని తేల్చి చెప్పేశారు.
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పుల తడక.. ఈ రిపోర్టు నిలవదు
కాంగ్రెస్ వాళ్లకు చేతగాకనే సీబీఐకి అప్పగించారు – బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ pic.twitter.com/0JfeES9K54
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2025