డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన తాజా చిత్రం బార్బరిక్. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఆ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాకుండా తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. బార్బరిక్ సినిమా ఆడుతున్న థియేటర్ కు మోహన్ వెళ్ళగా అందులో కేవలం పది మంది మాత్రమే ప్రేక్షకులు ఉన్నారు. అక్కడ ఉన్న వారిని సినిమా ఎలా ఉందని అడగ్గా బాగుందని చెప్పారు.

కానీ ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్లకు రావడం లేదు. ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. నేను ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య చాలా భయపడుతుంది అంటూ మోహన్ శ్రీవత్స కన్నీరు పెట్టుకున్నారు. దీంతో నెటిజన్లు మోహన్ శ్రీవత్సపై ఫైర్ అవుతున్నారు. తీసిన ప్రతి సినిమా సక్సెస్ కాదు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరిస్తారని అంటున్నారు. ఇంత చిన్న దానికి ఇలా కన్నీరు పెట్టుకోవడం, చెప్పుతో కొట్టుకోవడం ఏ మాత్రం బాగోలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చెప్పుతో కొట్టుకున్న సినిమా డైరెక్టర్
తన సినిమా చూడటానికి జనాలు ఎందుకు థియేటర్‌కు రావడం లేదని కన్నీళ్లు పెట్టుకున్న 'బార్బరిక్' సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స
రెండున్నరేళ్లు కష్టపడి సినిమా తీస్తే పది మంది కూడా రావడం లేదని ఆవేదన చెందుతూ చెప్పుతో కొట్టుకున్న డైరెక్టర్ pic.twitter.com/ZmqEMJqZaV
— BIG TV Breaking News (@bigtvtelugu) September 1, 2025