టీఆర్ఎస్‌లోకి ఈటల.. బీజేపీలోకి కవిత.. డైవర్షన్ గేమ్?

-

రాజకీయాలు ఒకప్పుడు మాదిరిగా లేవు..నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవడం, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం అనేది ఇప్పుడు కనబడటం లేదు. ప్రత్యర్ధులని దెబ్బకొట్టడానికి ఎంతకైనా దిగజారిపోతున్నారు. దేశం మొత్తం ఇదే పరిస్తితి ఉంది..రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి విలువలు లేని రాజకీయాలు నడుస్తున్నాయి.

ఇక తెలంగాణలో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య మరీ దారుణమైన పోలిటికల్ గేమ్ నడుస్తోంది. పర్సనల్‌గా టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మరీ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా చూపిస్తూ, ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ వరెస్ట్ రాజకీయాలకు ఉదాహరణగా చెప్పాలంటే తాజాగా ఈటల రాజేందర్ మళ్ళీ టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారని, అటు కేసీఆర్ కుమార్తె కవితని బీజేపీలోకి లాగడానికి చూస్తున్నారని చర్చ రావడం దరిద్రమైన విషయం.

తాజాగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్..స్వయంగా తన కుమార్తె కవితని బీజేపీలోకి ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. ఇందులో వాస్తవం ఏంటి అనేది ఎవరికి తెలియదు. అసలు ఓడిపోయిన కవిత తమకెందుకు అని, పైగా లిక్కర్ స్కామ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అంటే బీజేపీని ఇరుకున పెట్టడానికి ఇది కేసీఆర్ వేసిన ఎత్తా? లేక నిజంగా బీజేపీ ట్రై చేసిందా? అనేది క్లారిటీ లేదు.

కవిత విషయం పక్కన పెడితే..ఎన్నో అవమానాల మధ్య టీఆర్ఎస్‌లో నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరి..మళ్ళీ హుజూరాబాద్‌లో సత్తా చాటిన ఈటల..టీఆర్ఎస్‌లోకి వెళ్తారని ప్రచారం మొదలైంది. ప్రముఖ మీడియా డెక్కన్ క్రానికల్..కేసీఆర్ ఘర్‌వాపసీ కార్యక్రమం చేపట్టారని,ఇందులో భాగంగా ఈటలని టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారని,ఇప్పటికే చర్చలు జరిపారని, డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారని కథనం ఇచ్చినట్లు తెలిసింది. అయితే టీఆర్ఎస్‌లో చేరే ప్రసక్తి లేదని, కేవలం ఇది టి‌ఆర్‌ఎస్ కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారమే అని ఈటల ఖండించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇలా ఈటల..టి‌ఆర్‌ఎస్‌లోకి అని, కవిత-బీజేపీలోకి అనేది పూర్తిగా డైవర్షన్ గేమ్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version