కృష్ణకు ఫాల్కే అవార్డు ఇచ్చేలా కేంద్రానికి సిఫార్సు: బండి సంజయ్

-

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం నివాళులర్పించారు. హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భయమనే పదానికి అర్థం తెలియకుండా కృష్ణ బతికారన్నారు. ఎన్నో సాహసాలను తాను ప్రదర్శించారన్నారు. సాహసమే ఊపిరిగా జీవితాంతం బతికారని కొనియాడారు బండి సంజయ్. సినిమా రంగంలో అనేక ప్రయోగాలు చేసిన ఏకైక హీరో కృష్ణ అని బండి సంజయ్ గుర్తుచేశారు. నిర్మాతలను ఆదుకున్న వ్యక్తిగా కృష్ణకు పేరుందన్నారు బండి సంజయ్. ఒకే సంవత్సరం 19సినిమాలు తీసి ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధికల్పించిన వ్యక్తిగా మెచ్చుకున్నారు బండి సంజయ్.

క్రమశిక్షణకు మారుపేరు కృష్ణ అన్నారు. తెలుగు వెండితెరకు సాంకేతికత అనే రంగులను కృష్ణ అద్దారని బండి సంజయ్ కొనియాడారు. మానవత్వం ఉన్న మంచి మనిషి కృష్ణ అని బండి సంజయ్ చెప్పారు. వివాదాలకు దూరంగా కృష్ణ కటుంబం ఉండేదన్నారు. సినీ రంగానికి కృష్ణ చేసిన సేవలు చాలా గొప్పవని, ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు బండి సంజయ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version