హుజూరాబాద్ లో కేసీఆర్ చాణక్యానికి బీజేపీ బలి.. ఈటెల?

-

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పక్షాలకూ అత్యంత కీలకం! ఈ ఎన్నిక అధికారపక్షానికి ప్రీఫైనల్ పరీక్షగా ఉంటే… ప్రతిపక్షాలకు భవిష్యత్తుపై క్లార్టిటీ ఇచ్చేదిగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ పేరు చెబితే ఫైరయిపోతున్న ఈటెల రాజేందర్ కు.. కేంద్రంలోని బీజేపీ నుంచి అందుతున్న సహకారం ఎంత? కేసీఆర్ చాణక్యానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు దొరికిపోతున్న అంశంపై వారికున్న అవగాహన ఎంత?

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

ఇంతకాలం సైలంట్ గా ఉన్న కేసీఆర్… హుజూరాబాద్ ఉప ఎన్నిక పేరు చెప్పి దళితులపై కొత్త ప్రేమ చూపించారు.. తెగ బాదపడిపోయారు! అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే సుమా… ఒకపక్క నిధుల సమీకరణలో ఉన్న బీజేపీ పెద్ద్దలు… మానిటైజేషన్ పేరు చెప్పి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా… తెలంగాణలో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాల గురించి చర్చించేస్తున్నారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదేనని.. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం తామేనని, ఆ పార్టీతో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతుందని… కేసీఆర్ తో లంచ్ సందర్భంగా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అర్థంచేసుకోవడానికి కాస్త కన్ ఫ్యూజన్ గా ఉన్నా.. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఈ మాటలకు ప్రజల్లో చోటెంత? కేసీఆర్ ఢిల్లీ యాత్రలో ప్రధానితో మంతనాలు – బీజేపీ పెద్దలు తెలంగాణలో కేసీఆర్ తో లంచ్ లు! మధ్యలో ఈటెల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే కామెంట్లు!

తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో మెజారిటీ నిధులు ఇస్తున్నది తామే అని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే మాటకారులు టి.బీజేపీలో ఉన్నారా? అది వారికే తెలియాలి! ఈ పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీలో ఈటెల వన్ మ్యాన్ షో చేసుకోవాల్సిన పరిస్థితిని పరోక్షంగా కల్పిస్తున్నారు కేసీఆర్. ఇందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంది కేంద్రంలోని బీజేపీ.

ఈ పరిస్థితుల్లో… హుజూరాబాద్ ఎన్నిక లో ఈటెల గెలుపు అంత ఈజీకాదనే విశ్లేషణలు మొదలైపోయాయి. నేడో రేపో అమిత్ షా తెలంగాణలో పర్యటించి.. ఈటెలకు సపోర్ట్ గా నిలుస్తారని అంటున్నప్పటికీ… వాటిని సైతం హైజాక్ చేయగల నేర్పరితనం కేసీఆర్ సొంతం! మరి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ – కేంద్రంలోని బీజేపీ మధ్య.. ఈటెల నలిగిపోతారా.. బయటపడతారా అన్నది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version