భూమి గుండ్రంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని చిన్నతనంలో మనందరం చదువుకునే ఉంటాం. అయితే, భూమి గుండ్రంగా ఉండటంతో పాటు సూర్యుడి చుట్టూ తిరుగుతూ. తన చుట్టూ తాను తిరుగుతుందని కూడా తెలుసుకున్నాం. కానీ, ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.
ఎందుకంటే భూమి చివరి అంచును మనం ఎవరం చూడలేం. భూమికి ఒకవైపు నేల,మూడొంతుల నీరు ఉంటుంది. భూమి గుండ్రంగా తిరిగితే మనం ఎలా నిటారుగా నిలబడగలం? కిందపడిపోవాలి కదా? అని అందరికీ అనుమానం కలిగే ఉంటుంది. దానికి గురుత్వాకర్షణ శక్తి కారణమని, అందుకే మనం పడిపోకుండా ఆపుతుందని నేర్చుకున్నాం. అయితే,భూమిని గుండ్రంగా తిరిగే విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ లద్దాఖ్‌లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు. అ అద్భుత విజువల్స్ ను మీరు కూడా వీక్షించండి.
భూమి తిరగడాన్ని చూస్తారా?.. అద్భుత దృశ్యాలు
భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ లద్దాఖ్‌లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు. pic.twitter.com/VfbTh4u88v
— ChotaNews App (@ChotaNewsApp) February 1, 2025