జగన్‌ సంచలనం…ఏపీలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ !

-

జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి విప్ జారీ చేసింది వైసీపీ. తెరచాటు రాజకీయాల నేపథ్యంలో విప్ జారీ చేసింది వైసీపీ. దీంతో విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేయనుంది ఎన్నికల కమిషన్. రేపు పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగున్న సంగతి తెలిసిందే.

ycp

తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు జరుగనున్నాయి. నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ ల కోసం ఎన్నికలు ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్ పర్సన్ ల కోసం జరగనున్నాయి ఎన్నికలు. ఆయా మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని. ఈ తరుణంలోనే… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి విప్ జారీ చేసింది వైసీపీ.

Read more RELATED
Recommended to you

Latest news