దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు.. మోదీ కీలక నిర్ణయం..!

-

ఈ రోజు యూఎన్ ఆర్థిక, సామాజిక మండలి వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కరోనాపై పోరాటంలో భారత్ 150 దేశాలకు అండగా నిలిచిందన్నారు. ‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లుండాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. ‘అందరితో కలిసి అందరి అభివృద్ధి’ అనే నినాదంతో పనిచేస్తున్నామన్నారు.

 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన 50 దేశాల్లో ఇండియా కూడా ఒకటని, ఇవాళ అది 193 దేశాల కూటమిగా వృద్ధి చెందిందని మోదీ గుర్తుచేశారు. ప్రస్తుతం బహుళత్వ విధానం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదన్నారు. యూనియన్ల అభివృద్ధికి, యూఎన్ ఆర్థిక, సామాజిక మండలి ముదడుగుకు భారత్ ఎనలేని కృషి చేయిందని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచదేశాలకు సవాళ్లు విసిరిందని, భారత్ లో కోరానాపై పోరును ప్రజాయుద్ధంగా మలచడంలో సఫలీకృతులయ్యామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version