ఫూలే సినిమాను వారంతా తప్పక చూడాలి : విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

-

‘ఫూలే’ సినిమాను ప్రతిఒక్కరూ వీక్షించాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్,రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. దేశవ్యాప్తంగా ‘ఫూలే’ సినిమా ఎన్నో వివాదాల నడుమ తాజాగా రిలీజ్ అయ్యింది. ప్రముఖ సామాజిక తత్వవేత్త,మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతి రావు ఫూలే, అతని భార్య సావిత్రిబాయి అని.. వారి జీవిత చరిత్రల ఆధారంగా ‘ఫూలే’ చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపారు.

ఈ సినిమాపై ఆకునూరి మురళి శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు.‘మా ఎస్‌డీఎఫ్ ప్రతినిధులతో నిన్న ఫూలే సినిమా చూశాను. ఆడ పిల్లలకు విద్య ఇవ్వాలి అనే ఆశయం నెరవేర్చడానికి సనాతులతో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల త్యాగ పూరిత పోరాటాన్ని డైరెక్టర్ అనంత్ మహదేవన్ గొప్పగా తెరకెక్కించారు. నిర్మాతలకు ధన్యవాదాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు, ఓసీ, అంబేడ్కరిస్టులు, మహిళలు అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం కాకున్నా అంగీలు చించుకునే వాళ్ళు కూడా తప్పక చూడాల్సిన సినిమా’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news