హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ -2025 పోటీలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ ప్రతిష్టాత్మక పోటీలను నిర్వహించేందుకు తెలంంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చకచకా చేయిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్ష చేపట్టనున్నారు. కాగా, మొన్నటివరకు మిస్ వరల్డ్-2025 పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను ఐఏఎస్ స్మితా సబర్వాల్ పర్యవేక్షించగా.. ఆమెను ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.