మాజీ సీఎం బిజెపి అభ్యర్థి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కడప జిల్లా రాయచోటి లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని ఆయన కోరారు. రాయచోటి లోని ఒక గార్డెన్స్ లో రాష్ట్ర ప్రైవేట్ విద్యా సంస్థలు నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్ని సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి.
ఒక్క ప్రైవేట్ విద్యా సంస్థలనే కాదని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తారని ఫైర్ అయ్యారు తను సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్ నిధుల్ని సకాలంలో చెల్లించామని గుర్తు చేశారు. సీఎం జగన్ హయాంలో ఎప్పుడు ఏమి అవుతుందో తెలియని పరిస్థితి వచ్చిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బిజెపి తరఫున ఎంపీ అభ్యర్థిగా కడప జిల్లా రాజంపేట నుండి పోటీ చేస్తున్నారు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసారు.