2024 మే నెలలో బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 11 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఇందులో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజున సెలవు కూడా ప్రకటించింది ప్రభుత్వం. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.

2024 మే నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!

మే 1 (బుధవారం) : మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా బ్యాంక్లకు పబ్లిక్ హాలీడే ఉంటుంది.

మే 5 (ఆదివారం) : మే 5న ఆదివారం కనుక బ్యాంక్లకు సాధారణ సెలవు ఉంటుంది.

మే 8 (బుధవారం) : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (బంగాల్లో బ్యాంక్లకు సెలవు)

మే 10 (శుక్రవారం) : అక్షయ తృతీయ. అందువల్ల ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.

మే 11 (శనివారం) : మే నెలలో రెండో శనివారం ఇది. అందుకే బ్యాంకులకు సాధారణ సెలవు.

మే 12 (ఆదివారం) : సాధారణ సెలవు

మే 16 (గురువారం) : సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. అందుకే సిక్కింలో ఉన్న బ్యాంకులకు ఆ రోజు సెలవు.

మే 19 (ఆదివారం) : బ్యాంకులకు సాధారణ సెలవు

మే 23 (గురువారం) : బుద్ధ పూర్ణిమ. ఉత్తర్ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోన్ని బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.

మే 25 (శనివారం) : నజ్రుల్ జయంతి, నాలుగో శనివారం. అందువల్ల బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.

మే 26 (ఆదివారం) : ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు.

మరోవైపు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆ తేదీలు ఏంటంటే?

లోక్సభ మూడో దశ పోలింగ్ – మే7

లోక్సభ నాలుగో దశ పోలింగ్ – మే 13

లోక్సభ ఐదో దశ పోలింగ్ – మే 20

లోక్సభ ఆరో దశ పోలింగ్ – మే 25

 

Read more RELATED
Recommended to you

Exit mobile version