త్వరలోనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. సంగమేశ్వర,బసవేశ్వర ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజుల పాటు సుమారు 130 కిలోమీటర్లు హరీష్ రావు పాదయాత్ర చేయనున్నారు.ఈ క్రమంలోనే గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించనున్నారు. చివరి రోజున నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని గులాబీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.